దుబాయ్లో సోనూ సూద్కు గ్రాండ్గా బర్త్ డే విషెస్

దుబాయ్లో సోనూ సూద్కు గ్రాండ్గా బర్త్ డే విషెస్

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కరోనా టైంలో ఆయన మానవతా దృక్పథంతో సాయం చేసిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఆయనను రియల్ హీరోగా అభివర్ణించారు. ఇక ఇవాళ సోనూ బర్త్ డే టైంలో మాత్రం అభిమానులు కామ్ గా ఎలా ఉండగలరు. దుబాయ్ లోని ‘దుబాయ్ ఫెస్టివల్ సిటీ’ అనే ప్రముఖ ఆకాశ హార్మ్యంపై సోనూ సూద్ ఫొటోను కొన్ని నిమిషాల పాటు ప్రదర్శించారు. ‘హ్యాపీ బర్త్ డే సోనూ సూద్.. రియల్ హీరో.. మెసయ్య’ అనే మెసేజ్ ను తెరపై ప్రసారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు సోనూ సూద్ బర్త్ డే సందర్భంగా ఇసుక తిన్నెలో ఆయన సైకత శిల్పాన్ని ప్రముఖ కళాకారుడు  సుదర్శన్ పట్నాయక్ వేశారు.ఈ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి స్పందించిన సోనూ సూద్.. ‘‘సుదర్శన్  మీకు చాలాచాలా ధన్యవాదాలు.. మిమ్మల్ని నేరుగా కలవాలని ఉంది. ఒకసారి తప్పకుండా వచ్చి కలుస్త’’అని వ్యాఖ్యానించారు. 

‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై..

సోనూ సూద్ 1973 జులై 30న పంజాబ్ లోని మోగాలో జన్మించారు. ఆయనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తొలుత తమిళ సినిమాల్లో నటించారు. నాగార్జున  నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో సోనూ సూద్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అయితే అంతకుముందే కొన్ని అనువాద చిత్రాల ద్వారా సోనూ తెలుగుజనానికి పరిచయమయ్యారు. 1996లోనే తెలుగమ్మాయి సోనాలీని ఆయన పెళ్లాడారు. సోనూ, సోనాలీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అయాన్, ఇషాంత్.