కేటీఆర్కు సోనూ బర్త్ డే విషెస్

కేటీఆర్కు సోనూ బర్త్ డే విషెస్

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, రామ్‌గోపాల్‌ వర్మ, గోపీచంద్‌ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్‌, హరీశ్‌ శంకర్‌, అనసూయ, బండ్ల గణేశ్‌ తదితరులు మంత్రికి విషెస్‌ చెప్పిన వారిలో ఉన్నారు. ఇందుకు కేటీఆర్‌ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.

అయితే రియల్ హీరో సోనూ సూద్ తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ వేర్ ఈజ్ ద పార్టీ భాయ్ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. ఇందుకు కేటీఆర్ థాంక్స్ సోనూ భాయ్ అని రీట్వీట్ చేశాడు. అలాగే రామ్‌చరణ్‌ కేటీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ చేసిన ఓ ట్వీట్‌, దానికి మంత్రి ఇచ్చిన రిప్లై సరదాగా ఉంది. ‘నా ప్రియమైన సోదరుడు, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు చెర్రీ. దీనికి స్పందించిన కేటీఆర్‌ ‘థ్యాంక్స్‌ బ్రదర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నీ నటన గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విన్నాను. త్వరలోనే ఆ సినిమాను తప్పకుండా చూస్తాను’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.