శివరాత్రిపై సోనూ ట్వీట్‌‌.. ఫైర్ అవుతున్న నెటిజన్స్ 

శివరాత్రిపై సోనూ ట్వీట్‌‌.. ఫైర్ అవుతున్న నెటిజన్స్ 

ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్‌పై వివాదం రేగుతోంది. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న టైమ్‌‌లో లాక్‌డౌన్‌లో వేలాది మంది వలస కార్మికులను ఆదుకొని హీరోగా నిలిచిన సోనూపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్‌‌ను ఉద్దేశించి సోనూ చేసిన ట్వీటే ఇందుకు కారణం. శివుడి ఫొటోలను ఫార్వర్డ్ చేయడానికి బదులుగా ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా శివరాత్రిని జరుపుకోండంటూ సోనూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది.

‘హూ ద హెల్ ఆర్ యూ సోనూ సూద్’ అనే హ్యాష్ ట్యాగ్‌‌ను వైరల్ చేస్తున్నారు. అయితే సోనూ ఫాలోవర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘ఐ సపోర్ట్ సోనూ సూద్’ అంటూ ఫ్యాన్స్ సోనూకు మద్దుతుగా నిలుస్తున్నారు. సోనూ ట్వీట్‌‌లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా కొందరు ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు.