సోనూ సూద్ ఉదారత

సోనూ సూద్ ఉదారత

సమాజంలో చుట్టూ హృదయాన్ని కరిగించే ఎన్నో ఘటనలు జరుగుతున్నా కొంతమంది పట్టించుకోరు. కానీ.. బాలీవుడు నటుడు సోనూ సూద్ మాత్రం తన ఉదారత చాటుకుంటున్నాడు. చేతనైంత సహాయం చేస్తున్నాడు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు అంతా ఇంతా కాదు. తాజాగా.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న చిన్నారిని ఆదుకున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయించారు. తన ఇన్ స్టాగ్రామ్ లో చిన్నారికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. పలువురు నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. 

బీహార్ లోని చేవాడ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. రెండున్నర సంవత్సరాలున్న బాలిక పుట్టుకతోనే నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్పాయి. దీంతో ఆ చిన్నారి పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇతర పిల్లల మాదిరిగా ఆడుకోకపోవడం, ఇతరత్రా పనులు చేయలేకపోతోంది. వైద్య చికిత్స కోసం SDO కార్యాలయాన్ని చిన్నారి కుటుంబం ఆశ్రయించింది. అక్కడ ఉన్న వారిలో ఒకరు.. పాప పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో సోనూ సూద్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆపరేషన్ కు సంబంధించిన నిధులు సమకూర్చారు. వైద్యులు జరిపిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.

మొదటి ఫొటోలో చౌముఖికి సోనూ ఓ చాక్లెట్ ఇస్తున్నట్లు ఉంది. రెండో ఫొటోలో నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో కనిపిస్తోంది. చివరి ఫొటోలో చికిత్స విజయవంతమైన తర్వాత.. బెడ్ పై విశ్రాంతి తీసుకొంటోంది. విజయవంతమైన శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉందని సోనూ రాసుకొచ్చారు. నెటిజన్లు సోనూను సెల్యూట్ చేస్తున్నారు. భూమిపై అత్యుత్తమమైన వ్యక్తి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)