రియల్ హీరో ‘సోనూ సూద్’ బర్త్‌డే.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

 రియల్ హీరో ‘సోనూ సూద్’ బర్త్‌డే.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

హైదరాబాద్: కరోనా టైమ్‌లో ప్రజలను ఆదుకోవడంతో నటుడు సోనూ సూద్ పేరు మార్మోగిపోయింది. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను సొంతూళ్లకు పంపడం, కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడం లాంటి పనులతో సోనూకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పటికే ఆయనకు ఆంధ్ర ప్రదేశ్‌లో గుడి కూడా కడుతుండటం గమనార్హం. 

దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరిస్తూ ముందుకెళ్తున్న సోనూ.. ఇవ్వాళ 48వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, ఇతర ప్రముఖులు మొదలు సాధారణ ప్రజలు, ముఖ్యంగా యువత సోనూకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను ముంచెత్తారు. దీంత్తో ట్విట్టర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ ట్యాగ్ దూసుకెళ్తోంది. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఈ ట్యాగ్ మూడో స్థానంలో ఉంది.