ఐదేళ్ల తర్వాత  రాజకీయాల్లోకి వచ్చే అవకాశం

ఐదేళ్ల తర్వాత  రాజకీయాల్లోకి వచ్చే అవకాశం

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న  వేలాది మంది పేదల పాలిట సినీ నటుడు సోనుసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని నానా ఇక్కట్లు పడుతున్న వారిని కూడా తన సొంత ఖర్చులతో సొంతూళ్లకు తరలించాడు.దీంతో మన దేశంలో రియల్ హీరోగా నిలిచాడు.అంతేకాదు  సోను ప్రారంభించిన సేవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోను తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను పలు సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.

ఇప్పటికే.. సోను సోదరి మాళవిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పోటీ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

హరీశ్ రావు కాన్వాయ్ అడ్డుకున్నబీజేపీ నేతలు