‘క్రైమ్ ప్యాట్రోల్’ ఎపిసోడ్ పై  దుమారం.. సోనీ టీవీ వివరణ

‘క్రైమ్ ప్యాట్రోల్’ ఎపిసోడ్ పై  దుమారం.. సోనీ టీవీ వివరణ

సోనీ టీవీ ఐకానిక్ షో ‘క్రైమ్ ప్యా్ట్రోల్’లో ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ పై వివాదం చెలరేగింది. ఆ ఎపిసోడ్ లోని పలు సన్నివేశాలు ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధా వాకర్ హత్య కేసును తలపించేలా ఉన్నాయంటూ పలువురు ఆరోపణలు గుప్పించారు. ఈనేపథ్యంలో స్పందించిన సోనీ టీవీ  దీనిపై వివరణ ఇస్తూ ట్వి్ట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆ ఎపిసోడ్ పూర్తిగా కల్పితమైనదే. అవన్నీ  ఫిక్షన్ సన్నివేశాలే.

2011లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇతివృత్తంగా ఆ ఎపిసోడ్ ను చిత్రీకరించాం’’ అని సోనీ టీవీ స్పష్టం చేసింది. బ్రాడ్ కాస్టింగ్ ప్రమాణాలకు లోబడి తాము టీవీ షోలను తీస్తామని తేల్చి చెప్పింది. ఈ ఎపిసోడ్ పై ప్రేక్షకులు, నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో దాని ప్రసారాన్ని మధ్యలోనే ఆపేశామని గుర్తు చేసింది. ‘క్రైమ్ ప్యాట్రోల్’ సీరియల్ లోని ఆ ఎపిసోడ్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. అందుకు తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొంది.