సోనీ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు: ఫీచర్స్ ఇవే..

సోనీ నుంచి  మరో ఎలక్ట్రిక్ కారు: ఫీచర్స్ ఇవే..

సోనీ 'విజన్ ఎస్-02' పేరిట ఎలక్ట్రిక్ కారు రూపొందించింది. ఓ అంతర్జాతీయ ఆటో ఎక్స్ పోలో తన విద్యుత్ ఆధారిత కారును సోనీ సగర్వంగా ప్రదర్శించింది. సోనీ డిజైన్ చేసిన ప్రోటోటైప్ కార్లలో ఇది రెండోది. రెండేళ్ల కిందట సోనీ విజన్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింద. ఇప్పుడదే శ్రేణిలో మరింత అభివృద్ధి చేసిన మోడల్ ను తీసుకువచ్చింది.

ఈ కారులో 7 సీట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్ల ఎస్ యూవీ సెగ్మెంట్ లో ఇది టెస్లా మోడల్ ఎక్స్ కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇందులో సోనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సీఎంఓఎస్ సెన్సార్లను వినియోగించారు. ప్రయాణంలో నావిగేషన్ కు ఈ వ్యవస్థ ఎంతో సహకరిస్తుంది. 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై ఈ కారు 4.9 మీటర్ల నిడివితో నిర్మించారు. సోనీ తనట్రేడ్ మార్క్ 3డీ సౌండ్ సిస్టమ్ ను విజన్ ఎస్-02 కారులో పొందుపరిచింది.