న్యూజిలాండ్ మహిళా దిగ్గజ క్రికెటర్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ వన్డే క్రికెట్ కెరీర్ ముగిసింది. ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ముందు వన్డే కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ కివీస్ స్టార్ ప్లేయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26) న్యూజిలాండ్ మహిళా జట్టు ఇంగ్లాండ్ తో తమ చివరి మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్ కు ముందే న్యూజిలాండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నామమాత్రంగా జరిగిన ఈ వన్డేలో కివీస్ జట్టు ఓడిపోయింది. తన చివరి వన్డే మ్యాచ్ లో డివైన్ 23 పరుగులు చేసి విఫలమైంది.
దాదాపు రెండు దశాబ్దాలపాటు బ్లాక్ క్యాప్స్ కు ప్రాతినిధ్యం వహించిన డివైన్.. తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. తన చివరి మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ప్లేయర్స్ ఆమెకు గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరగబోయే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మూడు నెలల ముందే న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. 35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ టీ20 ఫార్మాట్ లో కొనసాగనుంది.
2006లో 17 ఏళ్ల వయసులో సోఫీ డివైన్ వన్డే క్రికెట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె కివీస్ మహిళా క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 159 వన్డేల్లో 32.66 సగటుతో 4279 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆల్-టైమ్ వన్డే రన్-స్కోరర్ జాబితాలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. ఆమె వన్డే కెరీర్ లో 18 హాఫ్ సెంచరీలతో పాటు 9 సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో కొనసాగుతానని చెప్పింది.
న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ అలవోక విజయం:
చిన్న టార్గెట్‌ను ఈజీగా ఛేదించిన ఇంగ్లండ్.. విమెన్స్ వరల్డ్ కప్ లీగ్ దశను విజయంతో ముగించింది. అమీ జోన్స్ (86 నాటౌట్), ట్యామీ బ్యూమోంట్ (40), హీథర్ నైట్ (33) రాణించడంతో.. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. దాంతో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించి రెండో ప్లేస్‌లో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 168 రన్స్‌కే ఆలౌటైంది. 21 రన్స్ వద్ద సుజీ బేట్స్ (10) ఔట్ కాగా, జార్జియా ప్లిమెర్ (43), అమెలియా కెర్ర్ (35) రెండో వికెట్‌కు 68 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. మిడిలార్డర్‌లో కెప్టెన్ సోఫీ డివైన్ (23) మోస్తరుగా ఆడినా, బ్రూక్ హాలీడే (4), మ్యాడీ గ్రీన్ (18), ఇసాబెల్లా గాజె (14), జెస్ కెర్ర్ (10), రోస్‌మేరి మైర్ (0), లీ తహుహు (2) నిరాశపర్చడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
లిన్సీ స్మిత్ 3, సివర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 172/2 స్కోరు చేసి నెగ్గింది. బ్యూమోంట్‌తో తొలి వికెట్‌కు 75 రన్స్ జోడించిన అమీ జోన్స్.. హీథర్ నైట్‌తో రెండో వికెట్‌కు 83 రన్స్ జత చేసింది. సోఫీ డివైన్, లీ తహుహు చెరో వికెట్ పడగొట్టారు.
A special guard of honour for Sophie Devine as she retires from the 50-over format after 19 years 🥹🖤#ENGvNZ | #CWC25 pic.twitter.com/zSUyaJu2oG
— ICC (@ICC) October 26, 2025
