మోత మోగుతున్నది.. సిటీలో సౌండ్ పొల్యూషన్ డబుల్

మోత మోగుతున్నది.. సిటీలో సౌండ్ పొల్యూషన్ డబుల్

రెసిడెన్షియల్, సెన్సిటివ్​ఏరియాల్లోనూ అధికంగా నమోదు
    గత రెండు నెలల్లో 20 –30 డెసిబుల్స్ ఎక్కువ 
    ప్రభుత్వం చర్యలు  తీసుకుంటున్నా నో రిజల్ట్స్ 
    పరిమితికి మించితే డేంజర్ అంటున్న ఎక్స్ పర్ట్స్

హైదరాబాద్​, వెలుగు:  సిటీలో సౌండ్​పొల్యూషన్​పెరిగిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మోత మోగుతోంది. సాధారణం కంటే అధికంగా డెసిబుల్స్​రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, సెన్సిటివ్​ఏరియాల్లోనూ నమోదు అవుతుంది. జూబ్లీహిల్స్​, అబిడ్స్, తార్నాక, జేన్​టీయూ, ప్యారడైజ్, సనత్​నగర్, గడ్డపోతారం, జీడిమెట్ల, జూపార్క్​, హెచ్ సీయూ ఏరియాల్లో సౌండ్ పొల్యూషన్​ను పొల్యూషన్​కంట్రోల్​బోర్డ్​(పీసీబీ) ప్రతినెలా లెక్కిస్తుంది.

గత జనవరి, ఫిబ్రవరిలో ఇండస్ట్రియల్, కమర్షియల్ ఏరియాలతో పాటు రెసిడెన్షియల్ ఏరియాలైన జూబ్లీహిల్స్, తార్నాక, సెన్సిటిల్​ఏరియాలైన గచ్చిబౌలి, హెచ్​సీయూ,  జూపార్క్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం సాధారణం కంటే 20–30 డెసిబుల్స్​ ఎక్కువగా నమోదు అవుతున్నట్టు స్పష్టమైంది. ఇందుకు కారణం.. రోజురోజుకు పెరిగిపోయే వాహనాలు, మోడిఫైడ్‌ సైలెన్సర్లు, పాత బండ్ల వాడకం వంటివి వాటితో పాటు సిటీ విస్తరణ కూడా  సౌండ్​ పొల్యూషన్​పెరిగేలా చేస్తోంది. ఓవైపు సౌండ్​ పొల్యూషన్​ను కంట్రోల్​ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.

రెసిడెన్షియల్ ఏరియాల్లోనే ఎక్కువగా.. 

సిటీలో పది కమర్షియల్‌, రెసిడెన్షియల్‌, ఇండస్ట్రియల్‌, సెన్సిటివ్​ ఏరియాలను ప్రామాణికంగా తీసుకుని పీసీబీ  ధ్వని తీవ్రతను లెక్కిస్తుంది. ప్రాంతానికో తీరుగా లెక్కిస్తుంది. జూబ్లీహిల్స్​, తార్నాక ఏరియాలను రెసిడెన్షియల్ గా పరిగణిస్తుంది. సాధారణంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో డే టైమ్​55 డెసిబుల్స్,  నైట్​టైమ్​45 డెసిబుల్స్​ఉండాలి. కానీ గత జనవరి, ఫిబ్రవరిలో డే  అండ్ నైట్ తేడా లేకుండా సగటుకు 20 డెసిబుల్స్ పైనే పెరిగిపోయింది. రెసిడెన్షియల్​ ఏరియాల్లో కూడా  సౌండ్​పొల్యూషన్​ అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే సెన్సిటివ్ ఏరియాల్లోనూ పెరిగింది.

అనారోగ్య సమస్యలు.. 

పరిమితిని మించిన సౌండ్స్​ విన్నవారికి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమా దముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువులు 90 డెసిబుల్స్‌ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని పేర్కొంటున్నారు.  అలాగే మెదడుపై దుష్ప్రభావం  పడుతుందని, ఏకాగ్రతను దెబ్బతీస్తుందని అంటున్నారు.  బ్లడ్​ ప్రెషర్​, నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని, వృద్ధుల ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.