కార్లో (ఐర్లాండ్): ఇండియా స్టార్ క్యూయిస్ట్ సౌరవ్ కొఠారీ వరుసగా రెండోసారి ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. తోటి ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ పంకజ్ అద్వానీకి చెక్ పెడుతూ టైటిల్ సొంతం చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఆల్ ఇండియన్ ఫైనల్లో సౌరవ్ 1133-477 తేడాతో 19 సార్లు వరల్డ్ చాంప్ పంకజ్ అద్వానీని చిత్తుగా ఓడించాడు.
మూడు గంటల పోరులో సౌరవ్ 485, 241, 155 పాయింట్ల భారీ బ్రేక్‌లతో అద్వానీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, మాజీ లెజెండ్ మనోజ్ కొఠారీకి ఈ ట్రోఫీని అంకితం ఇస్తున్నట్లు సౌరవ్ ప్రకటించాడు.

