V6 News

టీమిండియాతో టీ-20 సిరీస్ .. సౌతాఫ్రికా టీమ్ ఇదే

టీమిండియాతో టీ-20 సిరీస్ .. సౌతాఫ్రికా టీమ్ ఇదే

ఐపీఎల్ లో ఆడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూన్ 9 నుంచి 19 వరకు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య టీ-20 సిరీస్ జరగనుండగా... ఈ సిరీస్ కు జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. 
ముంబై ఇండియన్స్ ప్లేయర్ త్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి ప్రొటీస్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. అతనితో పాటు ఢిల్లీ జట్టులో బౌలింగ్ లో రాణిస్తున్న అన్రిచ్ నోర్ట్జే కూడా సెలక్ట్ అయ్యాడు. లక్నో ఓపెనర్ డికాక్ ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ రబాడా, చెన్నై బౌలర్ డ్వేన్ ప్రిటోరియస్ భారత్ తో జరిగే టీ-20 సిరీస్ లో ఆడనున్నారు. 

టీమిండియాతో టీ-20 సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు: 
టెంబా బవుమా (కెప్టెన్) క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఎన్రిజ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఆడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, టబ్రేయిజ్ షామ్సీ, ట్రిస్టాన్ స్టబ్స్, రాస్సీ వాండర్ డస్సెన్, మార్కో జాన్సెన్.

 

మరిన్ని వార్తల కోసం ..

వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?

సన్ రైజర్స్ కు డు ఆర్ డై మ్యాచ్