జోహన్నెస్‌బర్గ్: ఇండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ టీమ్‌ను సోమవారం ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవూమా తిరిగి కెప్టెన్సీ చేపట్టనున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన గత సిరీస్‌కు బవూమ కాలు కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు.
ఆ సిరీస్‌లో ఆడిన చాలామంది ఆటగాళ్లను కొనసాగిస్తూనే బవూమ కోసం డేవిడ్ బెడింగ్‌హామ్‌ను సెలెక్టర్లు తప్పించారు. నవంబర్ 14 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోతొలి టెస్టు, గువాహతి (22 నుంచి) రెండో టెస్టు షెడ్యూల్ చేశారు.
సౌతాఫ్రికా టెస్ట్ టీమ్: టెంబా బవూమ (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జార్జి, కార్బిన్ బాష్, వియాన్ మల్డర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ, సైమన్ హార్మర్.
