మూడో టెస్టులో భారత్ పరాజయం

మూడో టెస్టులో భారత్ పరాజయం

సౌతాఫ్రికా గడ్డమీద సిరీస్ గెలవాలనుకున్న భారత్ కు నిరాశే మిగిలింది. తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పరాజయం పాలైంది. దీంతో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచి 2-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 101/2 వికెట్ల తేడాతో నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా ఈజీగా గెలిచింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పీటర్సన్ 82 , డీన్ ఎల్గర్ 30, వాండర్ డస్సెన్ 41,బవుమా 32 పరుగులు చేయడంతో గెలుపు ఈజీ అయ్యింది భారత బౌలర్లలో  బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ లు తలో ఒక వికెట్ తీశారు. 
భారత్ తొలి ఇన్నింగ్స్ 223 ఆలౌట్,
భారత్  రెండో ఇన్సింగ్స్  198 ఆలౌట్
 సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్  210 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 212/3