IND vs SA: బవుమా ఈజ్ బ్యాక్.. ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా స్క్వాడ్ ప్రకటన

IND vs SA: బవుమా ఈజ్ బ్యాక్.. ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా స్క్వాడ్ ప్రకటన

ఇండియాతో నవంబర్ లో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా స్క్వాడ్ ను ప్రకటించారు. 15 మందితో కూడిన సఫారీ జట్టును సోమవారం (అక్టోబర్ 27) క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ టెంబా బవుమా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు దూరమైన ఈ సఫారీ కెప్టెన్ కాలి నొప్పి నుండి పూర్తిగా కోలుకున్నాడు. త్వరలోనే ఇండియా ఏ జరగబోయే టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు. బవుమా జట్టులోకి రావడంతో డేవిడ్ బెడింగ్‌హామ్‌పై వేటు పడింది. 

ఇండియాలో స్పిన్ పిచ్ లు కావడంతో కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, సిమోన్ హార్మర్ లకు జట్టులో స్థానం దక్కింది. రీసెంట్ గా జరిగిన పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ లో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు. కార్బిన్ బాష్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కాగిసో రబడా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. పవర్ ఫుల్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ స్క్వాడ్ లో స్థానం సంపాదించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025-27 లో సౌతాఫ్రికా ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. పాకిస్థాన్ పై జరిగిన ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడిపోయింది. 

నవంబర్ 14 నుంచి తొలి టెస్ట్:
 
నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్  న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. 

ఇండియాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు:

టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్ , ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డి జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, కాగిసో రబడా, సిమోన్ హార్మర్