సౌతాఫ్రికాదే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌.. జింబాబ్వేపై సునాయాసంగా గెలిచిన సఫారీలు

సౌతాఫ్రికాదే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌.. జింబాబ్వేపై సునాయాసంగా గెలిచిన సఫారీలు

బులవాయో: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న సౌతాఫ్రికా తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో 328 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో జింబాబ్వేపై గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 537 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించేందుకు 32/1 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో మంగళవారం (జులై 01) నాలుగో రోజు బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 66.2 ఓవర్లలో 208 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

మసకద్జా (57) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఎర్విన్‌‌‌‌‌‌‌‌ (49), ముజురబాని (32 నాటౌట్‌‌‌‌‌‌‌‌), సీన్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌ (26) కాసేపు పోరాడారు.  కార్బిన్‌‌‌‌‌‌‌‌ బాష్‌‌‌‌‌‌‌‌ 5, కొడి యూసుఫ్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు పడగొట్టారు. ప్రిటోరియస్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆదివారం నుంచి బులవాయోలోనే జరుగుతుంది.