మిల్లర్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు..సౌతాఫ్రికా భారీ స్కోరు

మిల్లర్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు..సౌతాఫ్రికా భారీ స్కోరు

టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఆటలో..సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ సూపర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ప్రోటీస్  టీమ్..భారత జట్టుకు 250 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. 

రాణించిన డికాక్..
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా..49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జన్నేమన్ మలన్ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దసేపటికే కెప్టెన్ బవుమాను శార్దూల్ బౌల్డ్ చేశాడు. అనంతరం 71వ పరుగుల  వద్ద మార్కరమ్..కుల్దీప్ యాదవ్ బౌలిం లో డకౌట్ అయ్యాడు. దీంతో పర్యాటక జట్టు..కేవలం 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డికాక్ జట్టును ఆదుకున్నాడు. క్లాసెన్తో కలిసి కొద్దిసే వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇదే క్రమంలో 54 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న  డికాక్ను  రవిబిష్ణోయ్ బుట్టలో వేసుకున్నాడు. 

అజేయ హాఫ్ సెంచరీలు..
డికాక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్..క్లాసెన్తో కలిసి జట్టును స్కోరును పరుగులు పెట్టించాడు. క్లాసెన్, మిల్లర్ ఇద్దరు పోటీ పడి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 5వ వికెట్ కు..139 పరుగులు జోడించడంతో..సౌతాఫ్రికా చివరకు 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించింది. మిల్లర్ 63  బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు, క్లాసెన్ 65 బంతుల్లో  6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసుకోగా...రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో  వికెట్ పడగొట్టారు.