రావల్పిండి: బౌలింగ్‌లో సిమోన్ హార్మర్ (6/50) చెలరేగడంతో.. పాకిస్తాన్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. పాక్ నిర్దేశించిన 68 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు గురువారం బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 12.3 ఓవర్లలో 73/2 స్కోరు చేసి గెలిచింది.
రైన్ రికెల్టన్ (25 నాటౌట్), ఐడెన్ మార్‌క్రమ్ (42) రాణించారు. అంతకుముందు 94/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 49.3 ఓవర్లలో 138 రన్స్‌కే కుప్పకూలింది. బాబర్ ఆజమ్ (50) హాఫ్ సెంచరీ చేయగా, హార్మర్ బౌలింగ్ దెబ్బకు సల్మాన్ ఆగా (28)తో సహా మిగతా వారందరూ విఫలమయ్యారు. శవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ముత్తుస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
