గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘోరంగా ఓడింది. ఐదో రోజు ముగిసిన టెస్టులో సఫారీలపై 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 549 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి పూర్తి చేతలేత్తేశారు. కేవలం 140 పరుగులకే మన జట్టు కుప్పకూలింది. సఫారీ స్పిన్నర్ హార్మర్ 6 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై ఇంత ఘోర పరాభవం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల టెస్టర్ సిరీస్ 2-0తో గెలుచుకుంది.
5 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇండియా మరో 50 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. తొలి సెషన్ లో సఫారీ స్పిన్నర్ హార్మర్ ధాటికి విలవిల్లాడిన భారత జట్టు ఐదో రోజు రెండో సెషన్ లో సాయి సుదర్శన్, సుందర్ వికెట్ లు వెంటనే కోల్పోయింది. నితీష్ డకౌట్ కావడంతో పాటు జడేజా, సిరాజ్ వెంట వెంటనే ఔట్ కావడంతో టీమిండియాకు ఘోర ఓటమి తప్పలేదు. 54 పరుగులు చేసి జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు.
2 వికెట్ల నష్టానికి 27 పరుగులతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. నైట్ వాచ్ మెన్ కుల్దీప్ యాదవ్ ను హార్మర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే ధృవ్ జురెల్ ను పెవిలియన్ కు పంపి మరో బిగ్ షాక్ ఇచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా హార్మర్ ఖాతాలోకే వెళ్ళింది. దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజాతో కలిసి సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా టీ బ్రేక్ కు వెళ్లారు. వికెట్ పడకుండా రెండో సెషన్ ఆడగలిగితే ఈ మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు.
నాలుగో రోజు ఆటలో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు. నాలుగో రోజు 26/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 260/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టాన్ స్టబ్స్ (94) సెంచరీ మిస్ చేసుకోగా, టోనీ డి జోర్జి (49) రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి సెంచరీతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మార్కో జాన్సెన్ 6 వికెట్లతో విజృంభించడంతో ఇండియా 201 పరుగులకే ఆలౌట్ అయింది.
As dominant as it can get!
— ESPNcricinfo (@ESPNcricinfo) November 26, 2025
South Africa hand India their biggest Test defeat (by runs)https://t.co/LQtmdEJE3q #INDvSA pic.twitter.com/tbM9FJ6ZWR
