
సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU) ఎకనామిక్స్ ప్రొఫెసర్ భట్టాచార్యను ఉద్యోగం నుంచి తొలగించింది. స్టయిఫండ్ కోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు తెలిపిన నిరసనలకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో ప్రొఫెసర్ భట్టాచార్యను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టాడని ప్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్యను తొలగిస్తున్నట్లు గురువారం యూనివర్సిటీ ప్రకటించింది.
2011లో SAU లో చేరిన ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్య.. ఆర్థిక శాస్త్ర విద్యార్థుల మొదటి బ్యాచ్ కు భోధించారు. అయితే యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో 2023లో సస్పెండ్ అయిన నలుగురు ఫ్రొఫెసర్లతో భట్టాచార్య ఒకరు. మిగతా ముగ్గురు ప్రొఫెసర్లు చేసిన తప్పును ఒప్పుకోవడంతో మరోసారి అలా చేయమని లెటర్ రాసివ్వడంతో వారిని తిరిగి నియమించారు. అయితే భట్టాచార్య మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో అతడిని విధులనుంచి తొలగించారు.
►ALSO READ | PM Modi..అల్లర్ల తర్వాత..తొలిసారి మణిపూర్కు ప్రధాని మోదీ..గిప్పుడొచ్చి ఏం చేస్తారంటున్న ప్రతిపక్షాలు
అయితే భట్టాచార్య తొలగింపుపై విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం తీవ్ర విమర్శలు చేసింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు రాసిన లేఖలో భట్టాచార్య సస్పెన్షన్ ,తొలగింపు చర్యలను ఉపసంహరించుకోవాలని పూర్వ విద్యార్థుల బృందం కోరింది.
భట్టాచార్య USA లోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొందారు.దశాబ్దానికి పైగా SAUలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. SAARC సభ్య దేశాలు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం.. ఉన్నత విద్య సహకారానికి ప్రాంతీయ కేంద్రంగా ఉంది.