ఇవాళ కేరళకు రుతుపవనాలు..4 రోజుల తర్వాత తెలంగాణలోకి

ఇవాళ కేరళకు రుతుపవనాలు..4 రోజుల తర్వాత తెలంగాణలోకి
  •     నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి ప్రవేశం
  •     ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్తాయని వాతావరణ శాఖ వెల్లడి
  •     రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు : అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. మే 31 నాటికి కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేయగా, ఒకరోజు ముందే గురువారం (మే 30) కేరళలోకి వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడంతో రుతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమమైనట్టు అధికారులు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వాస్తవానికి జూన్ 10లోపు రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో జూన్ 5లోపే రావొచ్చని వెల్లడిస్తున్నారు. 

సాధారణం కన్నా ఎక్కువే..

ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని సెకండ్ లాంగ్ రేంజ్ ఫోర్ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదల చేసిన తొలి అంచనాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. అయితే, సెకండ్ ఫోర్ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడతాయని వెల్లడించింది. 106 శాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎల్ నినో న్యూట్రల్ కండిషన్స్ ఏర్పడతాయని, మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సూన్ పురోగమిస్తున్న కొద్దీ లానినా పరిస్థితులు వస్తాయని తెలిపింది. 

భారీ ఉష్ణోగ్రతలు నమోదు..

రాష్ట్రంలో బుధవారం పలు చోట్ల భారీ టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యాయి. టాప్ టెన్ ఉష్ణోగ్రతలు రికార్డయిన ప్రాంతాల్లో ఐదు మంచిర్యాల జిల్లా నుంచే ఉండడం గమనార్హం. ఈ జిల్లాలోని నీల్వాయిలో 46 డిగ్రీలు, బెల్లంపల్లిలో 45.8, హాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.5, నెన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు టాప్ టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మూడు ప్రాంతాలు ఉన్నాయి. 

కుమ్రంభీం జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.7, కౌటాలాలో 45.3, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 45.4, ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 45.2, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45.1, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా గుడాపూర్, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 44.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44.6, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.4, ఖమ్మం జిల్లా పమ్మిలో 44.3, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టల్లో 44.1, ములుగు జిల్లా వెంకటాపురం, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో 44 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. మిగిలిన చోట్ల కొంత తక్కువగానే నమోదయ్యాయి.

రేపటి నుంచి వర్షాలు..

రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది.