రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఐదు చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేశాం : అఖిల్‌‌‌‌మహాజన్

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఐదు చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేశాం : అఖిల్‌‌‌‌మహాజన్

బోయినిపల్లి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టే వాటిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్  పేర్కొన్నారు. శనివారం రాత్రి బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదు చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేపామన్నారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ప్రత్యేక  బృందాలు జిల్లాలో కూడళ్ల వద్ద తనిఖీలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా చెక్‌‌‌‌పోస్ట్​ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి, ఎస్ఐ మహేందర్ ఉన్నారు.