నా పాత్ర‌ల‌కు ఆయ‌నే డ‌బ్బింగ్ చెప్పారు

నా పాత్ర‌ల‌కు ఆయ‌నే డ‌బ్బింగ్ చెప్పారు

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలు మృతి ప‌లువురిని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ప‌లు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. న‌టుడు సుమ‌న్ బాలు మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తూ.. ఆయ‌న‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నా కెరీర్‌ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలుగారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలుగారు నాకు పాడారు. అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. అలాగే శ్రీ రామదాసులో రాముని పాత్ర‌కు కూడా నాకు డబ్బింగ్‌ చెప్పారు. బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సుమ‌న్ అన్నారు