74 మొక్కలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్

74 మొక్కలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్

దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలతో ఓ పార్కును నిర్మించబోతున్నది తమిళనాడుకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ పార్కులో ఓ లైబ్రరీని ఇతర వసతులను ఏర్పాటుచేయనుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో సిరు తుళి అనే స్వచ్చంద సేవా సంస్థ  ఎస్పీబీ వనాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.1.8 ఎకరాల స్థలంలో ఈ పార్కును ఏర్పాటుచేయబోతున్నారు సంస్థ నిర్వాహకులు.

గత సెప్టెంబర్ నెలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ సోకి చనిపోయారు. 74 ఏళ్ల వయస్సులో బాలూ మృతిచెందారు. అందుకనే ఈ పార్కులో 74 మొక్కలు నాటబోతున్నారు. అంతేకాదు ఒక్కోమొక్కకు బాలు పాడిన ఓపాట పేరు పెట్టబోతున్నారు.