
రాజన్నసిరిసిల్ల, వెలుగు: నిందితులకు శిక్షపడడంలో పోలీసులతో పాటు పబ్లిక్ప్రాసిక్యూటర్లది కీలకపాత్ర అని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. సోమవారం గత ఆరు నెలల్లో 48 మందికి శిక్షలుపడేలా కృషి చేసిన పీపీలను, కోర్టు కానిస్టేబుళ్లను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.
నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సందీప్, సతీశ్, విక్రాంత్, సీఐలు,ఎస్ఐలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ప్రజల సమస్యలను తీర్చేందుకే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. ఎస్పీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 23 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. పోలీస్ సిబ్బంది స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.