
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బీజేపీ ఎంపీ, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె చైర్‌లో ఉన్న సమయంలో ఖాన్ ట్రిపుల్ తలాక్‌పై మాట్లాడారు. మీరు నాకు ఎంతగా నచ్చారంటే.. మిమ్మల్ని చూస్తుంటే మీ కండ్లల్లో కండ్లు పెట్టి చూడాలని అనిపిస్తుందని ఆజంఖాన్ అన్నారు. అతని వ్యాఖ్యలపై రమాదేవి అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌తో మాట్లాడే వైఖరి ఇది కాదని, ఎంపీ ఆజం నుంచి క్షమాపణ కోరారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే తమ ఎంపీ ఆజంఖాన్ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఎస్పీ నేత అఖిలేశ్ అన్నారు. ఆజం చేసిన వ్యాఖ్యలపై కావాలనే కొందరు బీజేపీ నేతలు గందరగోళం చేస్తున్నారని సభలో అన్నారు.