రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో సత్తా చాటాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో సత్తా చాటాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: పోలీసుల ప్రతిభను వెలికితీయడానికి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ ఆఫీసు ఆవరణలో జోన్ 6 కమిషనరేట్ మినహా సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు చెందిన 58 మంది అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ టీం లకు జోనల్ లెవెల్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని 26న వరంగల్​లో నిర్వహించే రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక చేస్తామని తెలిపారు. 

నేర స్థలంలో క్లూస్ ఏ విధంగా సేకరించాలి, డాగ్ స్క్వాడ్ పనితీరుపై పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్ అనంతరం పూణేలో జరిగే డ్యూటీ మీట్ కు అర్హత సాధించాలని సూచించారు. సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసును ఛేదిస్తే ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు.