సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
  • ఎస్పీ రాజేశ్​చంద్ర

పిట్లం, వెలుగు : సైబర్ నేరాలు, ఆన్​లైన్​మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​ అధికారులకు సూచించారు. మంగళవారం పిట్లం పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలను అరికట్టేందుకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

డయల్ 100కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది తక్షణం స్పందించాలన్నారు.  రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు  విస్తృతం చేయాలన్నారు. ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు ఉన్నారు.