ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులే

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులే

గద్వాల, వెలుగు: జిల్లాలో ఎవరైనా ఎన్నికల కోడ్  ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎస్పీ రితిరాజ్  హెచ్చరించారు. శనివారం జిల్లాలోని ఇటిక్యాల, కోదండాపురం, అలంపూర్  పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ర్యాలంపాడు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చెక్ పోస్ట్ ల దగ్గర పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. క్యాష్, లిక్కర్, కానుకల తరలింపుపై నిఘా పెట్టాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు.