నల్గొండ అర్బన్, వెలుగు : పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయం తెలిపేందుకు సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్ ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సేవలు
వారి పని తీరు తెలుసుకునేందుకు, ఎఫ్ఐఆర్ నమోదు, ఈ–చలాన్, పాస్ పోర్ట్ ధ్రువీకరణ ఇతర అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని ఇక నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ తో కలిగిన పోస్టర్ అందుబాటులో ఉంటుందని, ఎవరికైనా పోలీసుల సేవలపై అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు.