రుచికరమైన ఆహారం వండకపోతే చర్యలు తీసుకుంటం

రుచికరమైన ఆహారం వండకపోతే చర్యలు తీసుకుంటం

చిన్నప్పటి నుంచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెను ప్రకారం వడ్డారో లేదో చెక్ చేశారు. తర్వాత స్టోర్ రూమ్ లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి సరుకులను పరిశీలించారు .

మెరుగైన వసతులు, పరిశుభ్రతకు స్పెషల్ డెవల్ మెంట్ నిధులు కేటాయించామని చెప్పారు. నాణ్యమైన సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసి రుచికరమైన ఆహారం వండాలని హాస్టల్ సిబ్బందికి తెలిపారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహంతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.