పార్లమెంట్ సమావేశాలను స్పీకరే డిసైడ్ చేస్తరు: మంత్రి కౌశల్ కిషోర్

పార్లమెంట్ సమావేశాలను స్పీకరే డిసైడ్ చేస్తరు: మంత్రి కౌశల్ కిషోర్

కొత్త పార్లమెంట్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, రాబోయే శీతాకాల సమావేశాలు అక్కడే నిర్వహించాలా లేక ప్రస్తుత భవనంలో నిర్వహించాలా అనేది లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 29న ముగుస్తాయి. అయితే నవంబర్‌లోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగా మంత్రి కిషోర్ పార్లమెంటు సమావేశాలపై స్పందించారు.  ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించాలా లేక పాత భవనంలో నిర్వహించాలా అనేది స్పీకర్ నిర్ణయిస్తారని కిషోర్ వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ భవనాన్ని నిర్మిస్తోంది. కొత్త భవనంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఒక గొప్ప రాజ్యాంగ మందిరం, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, ఒక లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రాంతాలు. విస్తారమైన పార్కింగ్ స్థలం కూడా ఈ భవనంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద, ప్రభుత్వం కొత్త ప్రధానమంత్రి కార్యాలయం (PMO), క్యాబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌లను కలిగి ఉండే ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ను కూడా నిర్మిస్తోంది.