వెయ్యేండ్ల నాటి భువనగిరి కోట ..ఓసారి చూసోద్దామా

వెయ్యేండ్ల నాటి భువనగిరి కోట ..ఓసారి చూసోద్దామా

అడ్వెంచర్ ట్రిప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతలా అంటే అలాంటి ప్లేసెస్ కి  మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపించేంత. వీకెండ్ లో  థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ కోరుకునేవాళ్లకి భువనగిరి కోట బెస్ట్ ఆప్షన్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ కోట పదోశతాబ్దం కాలం నాటిది. పశ్చిమ చాళుక్య రాజు నాలుగో త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఈ కోటని ఒక పెద్ద గుట్టు మీద కట్టించాడు. అతడి గుర్తుగా భువనగిరిని మొదట్లో త్రిభువనగిరి  అని పిలిచేవాళ్లు. దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద బండరాయి మీద ఉంటుంది ఈ కోట. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట ఎక్కి చూస్తే భువనగిరి టౌన్ మొత్తం కనపడుతుంది. 

కోట దగ్గరకి వెళ్లడానికి రాళ్లతో కట్టిన మెట్ల దారి ఉంటుంది. మెట్ల ప్రారంభంలో ఆంజనేయుడి గుడి ఉంటుంది. మెట్లు ఎక్కుతూ కోట దగ్గరికి వెళ్లడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. కోట చుట్టూ ఉన్న రాతిగోడ, రాళ్లతో కట్టిన మెట్లు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భువనగిరి కోట స్పెషాలిటీ. అంతేకాదు కొండ మీద అక్కడక్కడా నీటి కొలనులు, కోట లోపల ఆహారధాన్యాలు నిల్వ చేయడానికి, సైనికులు ఉండేందుకు ప్రత్యేకంగా కోటలో నిర్మించిన గదుల్ని చూడొచ్చు. భువనగిరి కోటలోని కొన్ని శాసనాలు ఒకప్పటి ట్రావెల్ కన్నడ, తెలుగు ప్రజల లైఫ్ స్టయిల్ ను   తెలియజేస్తాయి. ఎత్తైన ఈ కొండ మీద ట్రెక్కింగ్ చేస్తుంటారు. రాక్ క్లైంబింగ్ కోసం కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి.

ఇలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భువనగిరి. తెలంగాణలోని పలు సిటీల నుంచి ఇక్కడికి బస్సు, రైలు సౌకర్యం ఉంది.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు