అందాల చందమామ పుట్టినరోజు నేడు

అందాల చందమామ పుట్టినరోజు నేడు
  • పద్దెనిమిదేళ్ల సక్సెస్‌ఫుల్ మిత్రవింద..
  • ఇప్పటికీ చూపు తిప్పుకోనివ్వని గ్లామర్..
  • టాప్ హీరోలందరికీ ఫస్ట్ ప్రయారిటీగా నిలిచే లేడీ స్టార్..
  • ఒన్ అండ్ ఓన్లీ.. కాజల్ అగర్వాల్.
  • హీరోయిన్లు పదేళ్లు రాణించడమే కష్టమనుకునే రోజుల్లో యేళ్ల తరబడి సత్తా చాటుతూనే ఉన్న ఈ అందాల చందమామ పుట్టిన రోజు నేడు.  ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు...

1985లో.. ముంబైలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీలో పుట్టింది కాజల్. తండ్రి సుమన్ అగర్వాల్ బట్టల వ్యాపారి. అమ్మ ఒక కన్ఫెక్షనర్. సెయింట్ ఆన్స్‌ హైస్కూల్లో చదువు.. మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్.. మార్కెటింగ్ అండ్ అడ్వర్టయిజింగ్‌లో స్పెషలైషన్.. ఇదీ కాజల్ క్వాలిఫికేషన్. ఎంబీయే చేసి బిజినెస్ ఫీల్డ్‌లో ఎంటరవ్వాలనుకుంది కానీ తర్వాతి కాలంలో నటనవైపు అడుగులేసింది. కాజల్‌ కెరీర్ బాలీవుడ్‌లో మొదలైంది. తన మొదటి సినిమా ‘క్యూం.. హోగయానా’. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది కాజల్. ఆ తర్వాత తేజ డైరెక్షన్ లో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘లక్ష్మీకళ్యాణం’ మూవీలో కళ్యాణ్‌ రామ్‌కి జంటగా నటించింది.

అదే ఇయర్ కృష్ణవంశీ తీసిన ‘చందమామ’లో చాన్స్ కొట్టేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.  కాజల్ కెరీర్‌‌ని మలుపు తిప్పిన సినిమా.. ‘మగధీర’.  రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీసిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మిత్రవింద, ఇందు అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించింది కాజల్. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.  తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌‌ హీరోలందరితో నటిస్తూనే యంగ్ హీరోల సరసన మెరిసింది. కూల్‌గా ఉంటుందని, తన పనేదో తాను చేసుకు పోతుందని కాజల్‌ గురించి చెబుతారంతా.  ఇన్నేళ్ల కెరీర్‌‌లో ఎలాంటి వివాదాలూ లేకపోవడం వల్లే హీరోలు, దర్శకులు తమ సినిమాల్లో ఆమెని రిపీట్ చేస్తుంటారనేది ఇండస్ట్రీ టాక్.

 ఎండార్స్‌మెంట్స్ విషయంలోనూ కాజల్ చాలామంది హీరోయిన్ల కంటే బెటర్‌‌గా ఉంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌కి ఆమె బ్రాండ్ అంబాసిడర్. ప్యానసోనిక్, డాబర్, బ్రూ, శ్యామ్‌సంగ్ మొబైల్, లక్స్, పాండ్స్ లాంటి చాలా బ్రాండ్స్కి ఆమె అంబాసిడర్. కాజల్‌కి సేవా గుణం కూడా ఎక్కువే. పెటాతో పాటు గివింగ్ బ్యాక్ లాంటి ఎన్జీవోలతో కూడా అసోసియేట్ అయ్యింది కాజల్.  ఒక సినిమాలో పాట కూడా పాడిందనే విషయం చాలామందికి తెలియదు. ‘చక్రవ్యూహ’ అనే కన్నడ మూవీలో కాజల్‌తో ఒక పాట పాడించాడు తమన్. ఆ మూవీ హీరో పునీత్ రాజ్‌కుమార్‌‌తో కలిసి ఈ పాట పాడిందామె. కాజల్ అడుగులు ఓటీటీవైపు పడ్డాయి.

‘లైవ్ టెలికాస్ట్’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది.  2020 అక్టోబర్‌‌లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నా  యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది. ఆచార్యలో చిరంజీవికి జోడీగా నటించింది కానీ.. కొన్ని కారణాల వల్ల ఆమె పోర్షన్‌ను సినిమా నుంచి తొలగించారు.  కాజల్‌ రీసెంట్‌గా కనిపించిన మూవీ అంటే ‘హే సినామికా’ అనే చెప్పాలి. ప్రస్తుతం తన కొడుకు నీల్‌ ఆలనా పాలనలో గడుపుతోంది. ఆమె నటించిన ఘోస్టీ, కరుంగాపియమ్, ఉమ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇండియన్ 2 త్వరలో తిరిగి సెట్స్‌కి వెళ్లబోతోంది. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే కాజల్‌ జాయినవుతుందని సమాచారం. హ్యాపీ బర్త్ డే కాజల్.