Gaddar: గద్దర్ - పవన్ మధ్య ప్రత్యేక అనుబంధం.. చివరి రోజుల్లోనూ ఇద్దరూ..

Gaddar: గద్దర్ - పవన్  మధ్య ప్రత్యేక అనుబంధం.. చివరి రోజుల్లోనూ ఇద్దరూ..

ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  ఉద్యమకారుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఇవాళ(ఆగస్టు 6) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

పవన్, గద్దర్ మధ్య ప్రత్యేక అనుబంధం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజాగాయకుడు గద్దర్ కు ప్రత్యేక అనుభందం ఉంది. గద్దర్ పాటలంటే పవన్ కు చాలా ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా  పవన్ కళ్యాన్ ను గద్దర్ కలిసి అభినందించారు.  పవన్ కల్యాణ్ దక్షిణ భారత సంస్కృతి మీద తీసుకున్న వైఖరిని తాను బలపరుస్తున్నట్లు గద్దర్ చెప్పారు.  కష్ట సుఖాల్లో పవన్ ఆదుకున్నారని.. తనతో ఎంతో చనువు ఉందని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో గద్దర్ చెప్పారు. పవన్ ను కలిసినప్పుడు తన జేబులో ఎన్ని డబ్బులుంటే అన్ని తీసుకునేవాడినని..తమ మధ్య అంత చొరవ ఉండేదన్నారు. తనకు తమ్ముడిలాంటి వాడని తెలిపారు.

 గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు (జులై28)న పవన్  వెళ్లి పరామర్శించారు.   గద్దర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ధైర్యంగా ఉండమని త్వరలోనే కోలుకుంటారని గద్దర్ కు భరోసా ఇచ్చారు పవన్ .  ఈక్రమంలో పవన్ కు గద్దర్ కూడా సలహాలు ఇచ్చారు. రాజకీయం ఓ పద్మవ్యూహం అని.. అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని పవన్ కు గద్దర్ సూచించారు. పవన్ విజయం సాధించాలని ఓ అన్నగా  గద్దర్ ఆకాంక్షించారు.