
సరిగ్గా పాతిక రోజులు..
ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్..
ఉన్నది తక్కువ టైమే కావచ్చు.. కానీ ఇది కీలక సమయం..
ఎంసెట్ అయినా, నీట్ అయినా మీరు కలలు కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు
అడుగుదూరంలో ఇంటర్ పరీక్షలున్నాయి..
ఇప్పటివరకు చదివిన సిలబస్ అంతా రివిజన్ చేసుకునే సమయమిది.. ఏం చదివాం ఇంకా ఏం చదవాలి అని బేరీజు వేసుకునే సమయం.. ఏ మాత్రం అడుగు తడబడినా కలలు కన్న స్కోర్ మిస్ కావచ్చు.. వాటితోపాటు ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు? ఏఏ చాప్టర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? గతంలో అడిగిన ప్రశ్నలేంటి? మోడల్ పేపర్ ఎలా ఉంటుంది? 60కి 60 మార్కులు సబ్జెక్టులు ఏంటి? లాంటి డౌట్స్ స్టూడెంట్స్ బ్రెయిన్‌లో రన్ అవుతుంటాయి..ఎంత బాగా చదివినా కొందరు స్టూడెంట్స్ కొన్నిసార్లు పేపర్ మీద పెట్టే విషయంలో ఫెయిల్ అవుతుంటారు. అలా కాకుండా మీరు చదివిన విషయాలకు తోడుగా సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్ సలహాలు, సూచనలు జోడిస్తున్నాం.. ఇంత తక్కువ టైంలో వేటిమీద ఫోకస్ చేయాలి.. చదివిన అంశాలను ఎలా పేపర్‌పై పెట్టాలి వంటి టిప్స్ జత చేస్తూ ఈ వారం(02-02-2019) ఇంటర్ ఎగ్జామ్ స్పెషల్ మీకోసం.. రేపటి వెలుగు సంచికలో