కొల్లాపూర్​కు సీఎం కేసీఆర్ వరాలు

కొల్లాపూర్​కు సీఎం కేసీఆర్  వరాలు
  •    నియోజకవర్గంలోని ప్రతి జీపీకి రూ.15 ఇస్తానన్న కేసీఆర్
  •     పాలిటెక్నిక్​ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటన

నాగర్​కర్నూల్, వెలుగు : సీఎం కేసీఆర్  కొల్లాపూర్​కు వరాలు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరిక మేరకు స్పెషల్  ఫండ్స్ కింద రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. కొల్లాపూర్​లో ప్రభుత్వ పాలిటెక్నిక్​ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే జీల్దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవెల్  కెనాల్, పస్పుల బ్రాంచ్  కెనాల్  వైడనింగ్,  లైనింగ్, మల్లేశ్వరం మినీ లిఫ్ట్  పనుల సర్వే కోసం ఆదేశాలిస్తామన్నారు. బోడగట్టు చెక్  డ్యామ్​కు ఆదివారం జీవో ఇస్తామని ప్రకటించారు. కొల్లాపూర్  నియోజకవర్గంలోని ప్రతి జీపీకి రూ.15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్స్​​మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

పాలమూరుకు జేఎన్టీయూ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీని సాంక్షన్  చేస్తున్నట్లు ప్రకటించారు. పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లతో పాటు అదనంగా మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు 5 మెడికల్​ కాలేజీలు ఇచ్చామన్నారు. 

Also Raed:విఘ్నేశ్వరుని కథా ప్రారంభం

మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే 15 ఏండ్ల సమయం పట్టేదన్నారు. పీఆర్ఎల్ఐని 2015లో ప్రారంభించి 9 ఏండ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ పాలమూరులో ఒక్క మోటార్  స్టార్ట్​ అయిందని, కాలువలు లేవంటున్న ప్రతిపక్ష నేతలు తాము పెట్టే బస్సుల్లో వచ్చి చూసి మాట్లాడాలని సూచించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​ రెడ్డి పాల్గొన్నారు.

తమ్ముడూ సీటీలు బంద్  చేయండి..

సభలో సీఎం కేసీఆర్  ప్రసంగం ప్రారంభించగానే ప్రజలు గట్టిగా ఈలలు వేశారు. ‘తమ్ముడు సీటీలు కొట్టకంటి.. సీటీలు కొట్టేటోడు మనోడు కాదు. సీటీలు కొట్టే టైం అయిపోతోంది. చీకటి పడుతోంది. బుద్ది లేదా? చెబుతుంటే కూడా సీటీలు కొడతారా?  సీటీ కొట్టకండి.. ఆపు చేయండి’ అని పలు సందర్భాల్లో సీఎం గరం అయ్యారు.