రూ. 600లకే ‘గోల్డ్ పాన్’.. ఒక్కసారి తింటే..

V6 Velugu Posted on Apr 03, 2021

మిఠా పాన్, కలకత్తా పాన్, జర్ధా పాన్, కిట్ కాట్ పాన్, ఫైర్ పాన్, కేసర్ పాన్, స్విస్ చాక్లెట్ పాన్ మొదలైన ఏవేవో పాన్‌లు తిని ఉంటారు. కానీ, ఈ స్పెషల్ పాన్‌ని ఎప్పుడైనా తిన్నారా? పోనీ కనీసం చూశారా? లేకపోతే చూడండి. ఇంతకీ ఆ పాన్ ఏంటీ అంటారా.. అదే ‘గోల్డ్ పాన్’. కొబ్బరి, ఇలాచీ, లవంగాలు, చెర్రీస్, ఖర్జురా, మీథి పచ్చడి, ములేతి, గుల్కండ్, చాక్లెట్ వంటి వాటితో తయారుచేయబడే ఈ పాన్ ఢిల్లీలో ఇప్పుడు ఎంతో ఫేమస్ అయింది. ఈ పాన్ ఢిల్లీలోని కన్నాట్‌ ప్రాంతంలోని యాము'స్ పాన్‌మహల్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ పాన్‌లో అన్ని మిశ్రమాలు కలిపిన తర్వాత చివరగా.. ఎంతో ప్రత్యేకంగా తయారు చేయించిన గోల్డ్ పేపర్ చుడతారు. అందుకే ఈ పాన్‌కు ‘గోల్డ్ పాన్’ అనే పేరొచ్చింది. ఈ పాన్ తింటే నోటి దుర్వాసన దరిచేరదు. ఇందులో వాడే గుల్కండ్ మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఇంత ప్రత్యేకంగా తయారుచేసే ఈ పాన్ కేవలం రూ. 600లకే లభిస్తోంది. దాంతో ఒక్కసారి ఈ పాన్ తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ ఈ పాన్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

https://www.instagram.com/tv/CL8nFzHj3Dg/?utm_source=ig_web_copy_link

Tagged Delhi, Constipation

Latest Videos

Subscribe Now

More News