భద్రాచలం సీతారామయ్యకు ప్రత్యేక పూజలు

భద్రాచలం సీతారామయ్యకు ప్రత్యేక పూజలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం చేయగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. 

కాగా, భద్రాచలానికి చెందిన అడవి వెంకట శేషాచలపతిరావు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. ప్రధాని నరేంద్రమోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా భద్రాచలం ఆలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.