భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్ భద్రకాళి అమ్మవారిని బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్ లర్ గా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, పూర్ణకుమార్ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో చక్రి, సురేశ్​కృష్ణ తదితరులు ఉన్నారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి ఝాన్సీరాజేందర్​రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  - కాశీబుగ్గ, వెలుగు