
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయమే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. విఠలేశ్వర స్వామివారికి మహాపూజను వైభవంగా నిర్వహించారు.
మంటపంలో 24 గంటల పాటు అఖండ భజనను నిర్వహించారు.