
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎగువ మానేరు వద్ద వాగు దాటుతుండగా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన నాగయ్య గల్లంతయిన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక సెర్చింగ్ టీం ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి సెర్చ్ఆపరేషన్కొనసాగుతోంది. ఎగువ మానేరు ప్రవహించే మండలాల్లోని చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు, కల్వర్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు మొదలుపెట్టారు.
నర్మాల నుంచి గంభీరావుపేట వరకు, గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు, మల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వరకు, అక్కడి నుంచి సిరిసిల్ల వరకు, సిరిసిల్ల నుంచి మిడ్‌మానేరు వరకు వెతికేందుకు, ఒక్కో ప్రాంతానికి ఐదుగురితో టీం ఏర్పాటు చేశారు.