వేసవిలో బరువు తగ్గడానికి ప్రత్యేకమైన టీ రకాలు

వేసవిలో బరువు తగ్గడానికి ప్రత్యేకమైన టీ రకాలు

చాయ్.. ప్రతీ రోజు తాగందే రోజు మొదలవదు. ఎక్కడ ఉన్నా..ఎలాంటి పరిస్థితిలో ఉన్నా..టీ తాగాల్సిందే. ఆ తర్వాతే రోజు మొదలవ్వాల్సిందే. అయితే వానాకాలం, శీతాకాలంలో చాయ్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ వేసవి కాలంలో మాత్రం ప్రజలు చాయ్ తాగేందుకు ఇష్టపడరు. వేసవిలో చల్లని పానియాలు తాగేందుకే మొగ్గుచూపుతుంటారు. అందుకే టీలను భర్తీ చేసే ప్రత్యామ్నాయాలను ప్రయత్నిస్తుంటారు. అయితే వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతకు బాగా ఉపయోగపడే చాయ్ లను తయారు చేసుకునే తాగొచ్చని వైద్యులు చెబుతున్నారు.  ఈ రకమైన టీ..శరీర బరువును తగ్గిస్తుందంటున్నారు. 

వేసవిలో బరువు తగ్గడానికి ప్రత్యేకమైన టీ రకాలు

1. పుచ్చకాయ తొక్క టీ

శరీర బరువు తగ్గడానికి పుచ్చకాయ తొక్కతో తయారు చేయబడిన టీ గొప్ప ఎంపిక. పుచ్చకాయలో  కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. సాధారణంగా పుచ్చకాయ తినేసమయంలో చాలా తొక్కను పడేస్తారు. కానీ నిజానికి తొక్కలో అనేక రకాల పోషకాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ తొక్కతో ఆరోగ్యకరమైన టీని తయారు చేసుకోవచ్చంటున్నారు. 

పుచ్చకాయ తొక్క  టీ ఎలా తయారు చేసుకోవాలి..?

పుచ్చకాయ తొక్క టీ తయారు చేయడానికి.. తొక్క నుండి ఆకుపచ్చ భాగాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక- నీటి కుండలో తొక్కను 10- నుంచి 15 నిమిషాలు గులాబీ రంగులోకి వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఇది మరింత రుచిగా, ఆరోగ్య ప్రయోజనాల కోసం పుదీనా ఆకులను కూడా వేయవచ్చు. అందులో నుంచి వచ్చిన వేడి నీటిలోని  పుచ్చకాయ తొక్క, పుదీనా ఆకులను వడకట్టాలి. కొద్దిసేపు చల్లగా మారిన తర్వాత వాటికి ఐస్ ముక్కలు వేస్తే..పుచ్చకాయ తొక్క టీ రెడీ...

2. గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఆరోగ్యకరమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి.  ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, కొవ్వును కరిగించి శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్‌లను అందిస్తాయి. అంతేకాదు గ్రీన్ టీ  కొన్ని రకాల క్యాన్సర్‌ ప్రమాదాలను తగ్గిస్తాయి. గ్రీన్ టీ నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, టైప్ 2 డయాబెటిస్‌ను నివారిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. బ్లూ టీ

బ్లూ టీ...ఇది  క్లిటోరియా టెర్నేటియా మొక్క పువ్వుల నుండి తయారు చేయబడిన పానీయం. ఆగ్నేయాసియాకు చెందిన ఈ ఔషధ మొక్క ను సీతాకోకచిలుక బఠానీ, కార్డోఫాన్ పీ, బ్లూ పీ, అపరాజిత అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ బ్లూ టీ...శరీర బరువును తగ్గిస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం...మనస్సును శాంతింపజేయడం, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా  జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.  కూల్ బ్లూ టీ  శరీరాన్ని చల్లబరుస్తుంది.  ఇది కెఫిన్ లేనిది మరియు పూర్తిగా మూలికా సమ్మేళనం.  గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది. 

4. హెర్బల్ టీ..

సాధారణంగా అనేక రకాల హెర్బల్ టీలు ఉన్నాయి.  వేటికవే ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. 
ప్రసిద్ధ చెందిన హెర్బల్ టీలు

1. చామంతి టీ:  చామంతి టీ అనేది ఔషధాల టీ.. చామంతి పూలతో తయారు చేసే టీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడి తగ్గించడానికి  రోజూ కప్పు చామంతి టీ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.  చామంతి పూలతో తయారుచేసే టీ సువాసనతో పూల రుచిని కలిగి ఉంటుంది. చామంతి టీ పలు అనారోగ్య సమస్యలకు చక్కగా పని చేస్తుంది.

2. రూయిబోస్ టీ: రూయిబోస్ టీ కెఫిన్ లేని టీ.  రూయిబోస్ టీ ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో  సహాయపడుతుంది. దీన్ని దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. ఈ టీలో అనేక యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతుంది. రూయిబోస్ అనే మొక్క పేరుతో దీనికి రూయిబోస్ టీ అని పేరు పేట్టారు.  రూయిబోస్  అంటే "ఎరుపు బుష్" అని అర్థం. ఇది చాలా సువాసనగల ఆకులు, కొమ్మలను కలిగి ఉంటుంది.

3. పిప్పరమింట్ టీ:  ఈ టీలో మెంథాల్ ఉంటుంది.  ఇది కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, చలన అనారోగ్యానికి నివారణగా ఈ టీ పనిచేస్తుంది. ఈ టీ  ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్‌  నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

4.  అల్లం టీ:  అల్లం టీ ఉదయం సిక్‌నెస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకండా జీర్ణ సమస్యలను ఉపశమనాన్ని కలిగిస్తుంది.  ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలోనూ అల్లం టీ సహాయపడుతుంది.

5. మందార టీ: ఇది రక్తపోటు, కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది.  కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.