భీష్మ ఏకాదశి వేళ రామయ్యకు విశేష పూజలు

భీష్మ ఏకాదశి వేళ రామయ్యకు విశేష పూజలు

భద్రాచలం,వెలుగు : భీష్మ ఏకాదశి వేళ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం విశేష పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి బేడా మండపంలో స్వామికి నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో 42 జంటలు కంకణాలు ధరించి పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం బేడా మండపంలో ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. 11 సార్లు పారాయణం చేశాక దర్బారు సేవ జరిగింది. శ్రీసీతారామచంద్రస్వామికి తిరువీధి సేవ చేశారు. రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయం వరకు  తీసుకెళ్లి పూజలు చేశారు. తిరిగి స్వామి ఆలయానికి వచ్చారు. సాయంకాల ఆరాధనలు జరిగాయి.