
త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో యూత్, ప్రొఫెషనల్స్‌ను సభ్యులుగా చేర్పించాలన్నారు. పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌పై బేగంపేట క్యాంపు ఆఫీస్ నుంచి ఇన్‌చార్జీలతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్‌లైన్ మెంబర్‌షిప్స్‌ను ప్రోత్సహించాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లను మూకుమ్మడిగా చేర్పించాలని కోరారు. అంతటా సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని, ఇంకా వేగం పెంచాలన్నారు. ఇన్‌చార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు మెంబర్‌షిప్ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. సభ్యత్వ నమోదుపై కేబుల్ టీవీ, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోవాలని సూచించారు. లక్ష్యం మేరకు అన్ని నియోజకవర్గాల్లో 50 నుంచి 60 వేల మందిని సభ్యులుగా చేర్పించాలన్నారు.