స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

సినీ నటుడు సోనూసూద్ డిజిస్పైస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ… స్పైస్‌ మనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా  వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్‌ ఇన్పోమేటిక్స్‌ (CIL) సంస్థకు స్పైస్‌ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ అడ్వైజరీ బోర్డ్‌ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా విజృంభించన సమయంలో… లాక్‌డౌన్‌ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్‌ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా,  ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని  స్పైస్ మనీఫౌండర్‌ దిలీప్ మోడీ తెలిపారు.  ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం  చాలా ఆనందంగా ఉందన్నారు.

గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన  సాంకేతిక శక్తిని అందిస్తామన్నారు సోనూ సూద్. ఆత్మనిర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని చెప్పాడు  ‌.