మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో వార్న్ అంత్యక్రియలు

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో వార్న్ అంత్యక్రియలు

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ డెడ్ బాడీ ఆస్ట్రేలియా చేరింది. బ్యాంకాక్ నుంచి ప్రత్యేక విమానంలో వార్న్ డెడ్ బాడీని ఆస్ట్రేలియా తరలించారు. గురువారం రాత్రి మెల్ బోర్న్ లోని ఎస్సెండాన్ ఫీల్డ్స్ ఎయిర్ పోర్టుకి ప్రత్యేక ఫ్లైట్ వచ్చింది. చనిపోయాక వారం రోజుల తర్వాత డెడ్ బాడీ స్వదేశానికి చేరింది. వార్న్ పీఏ హెలెన్ నోలన్ తో పాటు ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈనెల 30న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో లక్ష మంది అభిమానుల సమక్షంలో వార్న్ అంత్యక్రియలు జరగనున్నాయి. దానికంటే ముందే కుటుంబసభ్యులు ప్రత్యేకంగా వార్న్ కు నివాళులర్పించనున్నారు. ఈనెల 4న థాయ్ లాండ్ లోని ఓ విల్లాలో (52) షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోయారు. రూల్స్ ప్రకారం పోస్టు మార్టం జరిపి వార్న్ ది సహజమరణమని తేల్చారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం

 

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు