బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయింపు

బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయింపు

రూ. 3,339. 32 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ప్రవేశ పెట్టిన 2023–2024 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయించింది. పోయినేడాది కంటే రూ. 723.97 కోట్లు పెంచింది.  2022–23 సీజన్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీకి తొలుత  రూ. 3,062.60 కోట్లు కేటాయించగా.. తర్వాత దాన్ని రూ. 2,673.35 కోట్లకు సవరించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’కు గతేడాది  కంటే రూ. 439 కోట్లు పెంచి రూ. 1,045 కోట్లు కేటాయించింది. స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌) బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూ. 36.09 కోట్లు పెంచి 785.52 కోట్లు ఇచ్చింది. నేషనల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్స్‌‌‌‌‌‌‌‌కు రూ. 325 కోట్లు కేటాయించింది.  నేషనల్‌‌‌‌‌‌‌‌ యాంటీ డోపింగ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీకి రూ.21.73 కోట్లు, నేషనల్‌‌‌‌‌‌‌‌ డోప్‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ లాబొరేటరీకి  రూ. 19.50 కోట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నది.