ఎల్బీనగర్, వెలుగు: ఆటలను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2025 స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఓమ్నీ హాస్పిటల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు 3కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యూత్ అవసరమైన గ్రౌండ్లు ఏర్పాటు చేసి కోచ్‌లను నియమించి రాష్ట్రంలో క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తామని మాటిచ్చారు.
ఎల్బీ స్టేడియంలో జిమ్ ఇతర వసతులు కల్పించేందుకు రూ.2.5 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ శివసేనా రెడ్డి, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
