గూగుల్ టీవీ ఓఎస్​తో క్యూఎల్‌‌ఈడీ టీవీలు

గూగుల్ టీవీ ఓఎస్​తో క్యూఎల్‌‌ఈడీ టీవీలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఫ్రెంచ్‌‌‌‌ కన్స్యూమర్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ బ్రాండ్‌‌ థాంప్సన్‌‌ క్యూఎల్‌‌ఈడీ టీవీలను లాంచ్​ చేసింది. ఇవి గుగూల్‌‌ టీవీ ఓఎస్​తో పనిచేస్తాయి.    50 , 55, 65 ఇంచుల్లో అందుబాటులో ఉంటాయి. 50 ఇంచుల టీవీ ధర రూ. 33,999 కాగా, 55 ఇంచుల టీవీ రేటు 40,999 రూపాయలు, 65 ఇంచుల టీవీ రేటు 59,999 రూపాయలు. ఫ్లిప్‌‌కార్ట్‌‌ బిగ్‌‌బిలియన్‌‌ డేస్‌‌ స్పెషల్‌‌ సేల్ ​నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి.

మేక్‌‌ ఇన్‌‌ ఇండియా విజన్‌‌లో భాగంగా థామ్సన్​ బ్రాండ్‌‌ లైసెన్సీ ఎస్‌‌పీపీఎల్‌‌ దేశంలో మొట్టమొదటిసారిగా గుగూల్‌‌ లైసెన్స్డ్‌  క్యూఎల్‌‌ఈడీ టీవీ తయారు చేసింది. పర్సనలైజ్డ్​ హోమ్‌‌ స్ర్కీన్‌‌,  స్మార్ట్‌‌ హోమ్‌‌ కంట్రోల్స్‌‌, ఫ్రేమ్‌‌లెస్‌‌ డిస్​ప్లే, డాల్బీ విజన్‌‌, డాల్బీ ఆటమ్స్‌, డాల్బీ డిజిటల్‌‌ ప్లస్‌‌, డీటీఎస్‌‌ ట్రూ సరౌండ్‌‌, బీజెల్‌‌  లెస్‌‌ డిజైన్‌‌, 40 వాట్‌‌  డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్‌‌ స్పీకర్‌‌, 2జీబీ ర్యామ్‌‌, 16 జీబీ రోమ్‌‌ వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.